61. లిప్తగా కదిలిందనుకున్న కాలమే
జీవపరిణామాన్ని తలక్రిందులు చేసింది
మృగాన్ని మనిషిని చేసి..ప్రకృతిని మాత్రం ధ్వంసం చేసింది
62. మనిషి చిగురించ్డం మొదలైన చోటదే..
తరువు నశించినట్లయ్యింది నిజమే
విశ్వచరిత విచిత్ర వైనమది
63. వారించలేదుగా తరువు
వేలకొమ్మలు నరికిన మనిషి ఎదిగిపోతున్నా
తనలో సర్వాంగాలూ ఒకొక్కటిగా విరిగిపడుతున్నా..
64. ప్రత్యూషమెప్పుడూ అద్భుతమే..
లేతకిరణాల నులివెచ్చని ధారలతో
ప్రకృతికి అభిషేకమవుతుంటే..
65. పరిచయవాక్యమక్కర్లేదు చిరునవ్వుకి..
నీ కన్నుల్లోకి చూసిన వారికి
పెదవులను మించి నవ్వే చూపు నీకున్నందుకు..
66. తొలకరికే పులకరిస్తున్నా..
నీ ప్రేమ జల్లుగా కురిస్తే ఏమైపోతానో..
ఈ అనుభూతి పులకరింతలెన్నని నెమరేసుకోవాలో..
67. ఎన్ని పదాల పుట్టుకలో..
ఒక కొమ్మ ఊదిన ఊపిరికి..
కొన్ని పరిమళ వాక్యాల కలయికకి..
68. అనూహ్యమైన స్పందన..
నేను కోరిన నివేదన..
నీది..నిజమే..
69. రోజుకో తలకాయతో రావణులు..
అతివలను గీత దాటించేందుకు..
కష్టాల ఊబిలో దించేందుకు..
70. మాటలు మరచిన పెదవి..
మనసు మౌనాన్ని చేరదీసాక
చేదు నిజాలలో అనుబంధం సడలిపోయాక..
71. నేటి నాగరికతకది నిజమే..
అయినవారికి అరిటాకులోనూ..కానివారికి కంచాల్లోనూ..
బంధాలకు అర్ధాలు తిరగరాస్తున్న రోజుల్లో..
72. ఆ కళ్ళకెప్పుడూ వేసవికాలమే..
నిత్యదాహంతో తపించిపోమంటూ..
ఉప్పుకన్నీటి అలల తాకిళ్ళతో..
73. ఎన్ని రాత్రుల విషాదమో..
నాలో పలుకుతున్న ఈ నిషాదం..
వియోగానికి చేరువైన హృదయం సాక్షి..
74. స్మృతులొక్కటే సరిపోతాయేమో..
తనెక్కడున్నా నన్ను చేరేందుకు..
నేనెంత దూరమైనా తనకు ఊపిరయ్యేందుకు..
75. కలల సవ్వళ్లనుకుంటా..
రెప్పలు దాటి రాగంలోకి మారి..
ఉషోదయాన్ని రసోదయం చేసినవి..
76. కొన్ని అనుమానాలంతే..
మనసుని కలిపి ఉంచలేవు..
సర్దుకుపోయి సహజీవనం చేయనీయవు..
77. నాతో నువ్వు మాట్లాడే..
ఆ వలపాక్షరాలే..
మౌనం..
78. తనివి తీరని తాపమే నీదెప్పటికీ..
మన పెదవుల సంవిధానంలో..
తపన పెరిగిన మురిపానికి..
79. మనసు వాకిలందుకే తెరిచుంచా..
మువ్వల సవ్వళ్ళు నిన్ను లాక్కొస్తాయని..
నా చిరునామాను చేరవేస్తాయని..
80. కొన్ని మౌనాలెంత మెలిపెడతాయో..
మాటలు దాచుకోనివ్వలేని పెదవుల్లో..
మరపురాని అతీతమైన వేదనలో..
జీవపరిణామాన్ని తలక్రిందులు చేసింది
మృగాన్ని మనిషిని చేసి..ప్రకృతిని మాత్రం ధ్వంసం చేసింది
62. మనిషి చిగురించ్డం మొదలైన చోటదే..
తరువు నశించినట్లయ్యింది నిజమే
విశ్వచరిత విచిత్ర వైనమది
63. వారించలేదుగా తరువు
వేలకొమ్మలు నరికిన మనిషి ఎదిగిపోతున్నా
తనలో సర్వాంగాలూ ఒకొక్కటిగా విరిగిపడుతున్నా..
64. ప్రత్యూషమెప్పుడూ అద్భుతమే..
లేతకిరణాల నులివెచ్చని ధారలతో
ప్రకృతికి అభిషేకమవుతుంటే..
65. పరిచయవాక్యమక్కర్లేదు చిరునవ్వుకి..
నీ కన్నుల్లోకి చూసిన వారికి
పెదవులను మించి నవ్వే చూపు నీకున్నందుకు..
66. తొలకరికే పులకరిస్తున్నా..
నీ ప్రేమ జల్లుగా కురిస్తే ఏమైపోతానో..
ఈ అనుభూతి పులకరింతలెన్నని నెమరేసుకోవాలో..
67. ఎన్ని పదాల పుట్టుకలో..
ఒక కొమ్మ ఊదిన ఊపిరికి..
కొన్ని పరిమళ వాక్యాల కలయికకి..
68. అనూహ్యమైన స్పందన..
నేను కోరిన నివేదన..
నీది..నిజమే..
69. రోజుకో తలకాయతో రావణులు..
అతివలను గీత దాటించేందుకు..
కష్టాల ఊబిలో దించేందుకు..
70. మాటలు మరచిన పెదవి..
మనసు మౌనాన్ని చేరదీసాక
చేదు నిజాలలో అనుబంధం సడలిపోయాక..
71. నేటి నాగరికతకది నిజమే..
అయినవారికి అరిటాకులోనూ..కానివారికి కంచాల్లోనూ..
బంధాలకు అర్ధాలు తిరగరాస్తున్న రోజుల్లో..
72. ఆ కళ్ళకెప్పుడూ వేసవికాలమే..
నిత్యదాహంతో తపించిపోమంటూ..
ఉప్పుకన్నీటి అలల తాకిళ్ళతో..
73. ఎన్ని రాత్రుల విషాదమో..
నాలో పలుకుతున్న ఈ నిషాదం..
వియోగానికి చేరువైన హృదయం సాక్షి..
74. స్మృతులొక్కటే సరిపోతాయేమో..
తనెక్కడున్నా నన్ను చేరేందుకు..
నేనెంత దూరమైనా తనకు ఊపిరయ్యేందుకు..
75. కలల సవ్వళ్లనుకుంటా..
రెప్పలు దాటి రాగంలోకి మారి..
ఉషోదయాన్ని రసోదయం చేసినవి..
76. కొన్ని అనుమానాలంతే..
మనసుని కలిపి ఉంచలేవు..
సర్దుకుపోయి సహజీవనం చేయనీయవు..
77. నాతో నువ్వు మాట్లాడే..
ఆ వలపాక్షరాలే..
మౌనం..
78. తనివి తీరని తాపమే నీదెప్పటికీ..
మన పెదవుల సంవిధానంలో..
తపన పెరిగిన మురిపానికి..
79. మనసు వాకిలందుకే తెరిచుంచా..
మువ్వల సవ్వళ్ళు నిన్ను లాక్కొస్తాయని..
నా చిరునామాను చేరవేస్తాయని..
80. కొన్ని మౌనాలెంత మెలిపెడతాయో..
మాటలు దాచుకోనివ్వలేని పెదవుల్లో..
మరపురాని అతీతమైన వేదనలో..
No comments:
Post a Comment