121. చేజారిన గుండెకేగా తెలిసేది..
అనుభూతుల విలువెంతో..
జ్ఞాపకాల రాపిడెంతో..
122. మరలిరాని రోజులెన్నో..
నిన్నల్లోకి నన్ను లాక్కెళ్తూ..
రేపటి గురించిన ఆలోచనలను మింగేస్తూ..
123. దూరం చేస్తావెందుకలా...
రావొద్దని సంకేతాలిస్తూ..
గారాన్ని ఘోరంగా నెట్టేస్తూ..
124. చిరునవ్వులు మురిసాయి..
నీ పెదవులని అలంకరించాయని..
నలుగురిని ఆకర్షించగలిగాయని..
125. అనవసరపు ఆలోచనలెందుకులే కళ్ళు తెరువక
ఆత్మీయతలు అడుగంటాక..
విషాదపులోతుల్లో సగం జారిపడ్డాక..
126. శృతికందని రాగాలెన్నో..
అపశృతులకు తాళమేస్తూ..
గొంతులోనే మూగబోతూ..
127. అమ్మాయినని అనిపించావు...
అలుకలను అందంగా తీర్చేస్తూ..
గడుసు పదాలతో సమాధానమిచ్చేస్తూ
128. హృదయం వేణువూదింది..
నీ ఊపిరులు తొలకరులై నన్ను మేల్కొల్పితే..
నీలో లయం కావాలనే..
129. విల్లుగా మారాయెందుకో నీ కనుబొమలు..
నన్ను ఎక్కు పెట్టేందుకో..
నీ మక్కువను చూపెట్టేందుకో..
130.
ఆడపిల్లవనే అలంకారం...
నా కంటికి కమనీయం...
నీ కన్నుల చిలిపిదనం..
131. వలచే గొరువంకవు నీవే..
చిలిపి సన్నాయిలతో మెప్పిస్తూ..
కలకూజితాలకి సాయమడుగుతూ..
132. జానపదాలెన్నో..
జావళీలుగా మారుతూ...
నీ జాణతనంలో ఒదుగుతూ..
133. ఆపలేకున్నా నెలవంకను..
నీవంక చూసినందుకే..
నా పెదవులను వీడి నిన్ను మీటుతూ..
134. గువ్వను నేనైతే..గోరింక నీవేగా..
అలకపానుపులెక్క నీ ముచ్చట తీర్చ..
నీ మాటను నేను కాదనలేనుగా...
135. తీయని వేదనలెన్నో..
నీ పిలుపులకు ప్రతిస్పందిస్తూ..
నీ వీణకు నాదాలవుతూ..
136. ఎన్ని స్వాతిముత్యాలుగా మారెనో..
నీ చినుకుల తొలకరులకి..
సాగరుని ఒడిని వీడి
137. జగాలన్నీ కూడ మనవే..
త్రిశంకులో ఊగిస్తూ..
దివినీ భువినీ కలిపేస్తూ..
138. చిలిపి కబురు చెవిని సోకింది..
గాలికిన్ని ఊసులేక్కడివని..
ఉరకలెత్తిన మనసు ఉరికింది..
139. ప్రతీ గవ్వనూ ఏరుతున్నా...
ఎందులో నీ ఆకృతుందోనని..
ఏది నా మనసు వింటుందోనని..
140. హృదయం గెంతులేస్తోంది..
నీ రాగాలను తాకినందుకు..
నా గొంతులో చేర్చినందుకు..
అనుభూతుల విలువెంతో..
జ్ఞాపకాల రాపిడెంతో..
122. మరలిరాని రోజులెన్నో..
నిన్నల్లోకి నన్ను లాక్కెళ్తూ..
రేపటి గురించిన ఆలోచనలను మింగేస్తూ..
123. దూరం చేస్తావెందుకలా...
రావొద్దని సంకేతాలిస్తూ..
గారాన్ని ఘోరంగా నెట్టేస్తూ..
124. చిరునవ్వులు మురిసాయి..
నీ పెదవులని అలంకరించాయని..
నలుగురిని ఆకర్షించగలిగాయని..
125. అనవసరపు ఆలోచనలెందుకులే కళ్ళు తెరువక
ఆత్మీయతలు అడుగంటాక..
విషాదపులోతుల్లో సగం జారిపడ్డాక..
126. శృతికందని రాగాలెన్నో..
అపశృతులకు తాళమేస్తూ..
గొంతులోనే మూగబోతూ..
127. అమ్మాయినని అనిపించావు...
అలుకలను అందంగా తీర్చేస్తూ..
గడుసు పదాలతో సమాధానమిచ్చేస్తూ
128. హృదయం వేణువూదింది..
నీ ఊపిరులు తొలకరులై నన్ను మేల్కొల్పితే..
నీలో లయం కావాలనే..
129. విల్లుగా మారాయెందుకో నీ కనుబొమలు..
నన్ను ఎక్కు పెట్టేందుకో..
నీ మక్కువను చూపెట్టేందుకో..
130.
ఆడపిల్లవనే అలంకారం...
నా కంటికి కమనీయం...
నీ కన్నుల చిలిపిదనం..
131. వలచే గొరువంకవు నీవే..
చిలిపి సన్నాయిలతో మెప్పిస్తూ..
కలకూజితాలకి సాయమడుగుతూ..
132. జానపదాలెన్నో..
జావళీలుగా మారుతూ...
నీ జాణతనంలో ఒదుగుతూ..
133. ఆపలేకున్నా నెలవంకను..
నీవంక చూసినందుకే..
నా పెదవులను వీడి నిన్ను మీటుతూ..
134. గువ్వను నేనైతే..గోరింక నీవేగా..
అలకపానుపులెక్క నీ ముచ్చట తీర్చ..
నీ మాటను నేను కాదనలేనుగా...
135. తీయని వేదనలెన్నో..
నీ పిలుపులకు ప్రతిస్పందిస్తూ..
నీ వీణకు నాదాలవుతూ..
136. ఎన్ని స్వాతిముత్యాలుగా మారెనో..
నీ చినుకుల తొలకరులకి..
సాగరుని ఒడిని వీడి
137. జగాలన్నీ కూడ మనవే..
త్రిశంకులో ఊగిస్తూ..
దివినీ భువినీ కలిపేస్తూ..
138. చిలిపి కబురు చెవిని సోకింది..
గాలికిన్ని ఊసులేక్కడివని..
ఉరకలెత్తిన మనసు ఉరికింది..
139. ప్రతీ గవ్వనూ ఏరుతున్నా...
ఎందులో నీ ఆకృతుందోనని..
ఏది నా మనసు వింటుందోనని..
140. హృదయం గెంతులేస్తోంది..
నీ రాగాలను తాకినందుకు..
నా గొంతులో చేర్చినందుకు..
No comments:
Post a Comment