321. తనువందుకే దాచుకున్నా..
పువ్వులను కోసుక్కొచ్చి
సౌందర్యాన్ని రాస్తావనే..
322. రాత్రికై ఎదురుచూడమంటోంది..
నీవున్న స్వప్నం నన్ను ఆహ్వానించేందుకు..
పగలంతా పొద్దుపోనివ్వనంటూ..
323. వేకువెన్ని కులుకులు నేర్చిందో..
నీ కవితలు నెమరేసినందుకు..
తూరుపును మేల్కొలిపి వేడుకైనందుకు..
324. వలపు చిగుళ్ళు మేస్తూ నేనున్నా..
వలచేందుకు నువ్వు సిద్ధపడ్డావని..
కాలాన్ని జయించి నిన్ను చేరాలని..
325. ఎన్ని జన్మల అనుబంధమో..
నిన్ను నన్నిలా కలిపింది..
మరో జన్మకైనా దగ్గరకాక తప్పదంటూ..
326. నీకు దూరమైన విషాదంలో
నేనుండిపోయా..
మరో ఊసన్నదే లేకుండా..
327. అహంకారం వదిలేసుకున్నా..
తన అనురాగం కావాలని..
తనకిష్టం నేనవ్వాలని..
328. జీవితమో పాటే..
పల్లవులన్నీ ఆనందంలో చేరి..
రాగంలో విషాదాలు కరిగి..
329. నన్ను నేను వెతుక్కోడం మొదలెట్టా..
నువ్వు చేరిన క్షణం..
కొత్తదనమేదో కనిపెట్టినట్లుండే..
330. మనసు చెమరించింది..
నీ కన్నుల్లోని తడి..
తాను ఆలకించినట్లుంది..
331. నా చెక్కిళ్ళపై చారలు..
కన్నీరు కాదది..
నీ స్మృతుల పలకరింపుల ఆనవాళ్ళు..
332. ప్రకృతో సత్యం చెప్తోంది..
అందమూ పరిమళమూ శాశ్వతం కాదని..
తనలానే జీవనం ఒకనాటికి ఆగక తప్పదని..
333. అనుభూతులకు కొదవేముంది..
అలరించే భావాలుండగా..
అందించే మన్మధుడు మదిలోనుండగా..
334. ఏం మాయ చేస్తేనేమిలే..
నా పేరుకో గమ్మత్తంటింది..
తన పెదవుల తడి తీపులందగానే..
335. నా పలుకు తీపిలే..
మకరందాన్ని పదేపదే వల్లెవేస్తానని..
పెదవులపై తానొచ్చి వాలింది తేనీగ..
336. లేతగులాబీలని పొగొడొద్దన్నానందుకే..
పెదవులు చూసినప్పుడల్లా నిన్ను..
మధుపాలు చుట్టూ చేరతాయనే..
337. అందానికిప్పుడో అతిశయమొచ్చింది..
నీ చూపుల్లోని వెక్కిళ్ళకి..
మనసెందుకు ఊగిందోనని..
338. మధుమాసానికి ముందే నేనొచ్చా..
మల్లెలకాలమంటే నీకిష్టమని
మనసందుకే పరిచి ఉంచుతావని..
339. నేనో భావుకనే..
నాకో ప్రపంచాన్ని సృష్టించుకున్నాక..
అందులో పువ్వులకీ మాటలొచ్చని తెలిసాక..
340. అనుమానమనుకోకు..
నీ మనసున బంధీగా మారి..
ఆ తాళాన్ని పొలిమేరలో విసిరేద్దామని..
పువ్వులను కోసుక్కొచ్చి
సౌందర్యాన్ని రాస్తావనే..
322. రాత్రికై ఎదురుచూడమంటోంది..
నీవున్న స్వప్నం నన్ను ఆహ్వానించేందుకు..
పగలంతా పొద్దుపోనివ్వనంటూ..
323. వేకువెన్ని కులుకులు నేర్చిందో..
నీ కవితలు నెమరేసినందుకు..
తూరుపును మేల్కొలిపి వేడుకైనందుకు..
324. వలపు చిగుళ్ళు మేస్తూ నేనున్నా..
వలచేందుకు నువ్వు సిద్ధపడ్డావని..
కాలాన్ని జయించి నిన్ను చేరాలని..
325. ఎన్ని జన్మల అనుబంధమో..
నిన్ను నన్నిలా కలిపింది..
మరో జన్మకైనా దగ్గరకాక తప్పదంటూ..
326. నీకు దూరమైన విషాదంలో
నేనుండిపోయా..
మరో ఊసన్నదే లేకుండా..
327. అహంకారం వదిలేసుకున్నా..
తన అనురాగం కావాలని..
తనకిష్టం నేనవ్వాలని..
328. జీవితమో పాటే..
పల్లవులన్నీ ఆనందంలో చేరి..
రాగంలో విషాదాలు కరిగి..
329. నన్ను నేను వెతుక్కోడం మొదలెట్టా..
నువ్వు చేరిన క్షణం..
కొత్తదనమేదో కనిపెట్టినట్లుండే..
330. మనసు చెమరించింది..
నీ కన్నుల్లోని తడి..
తాను ఆలకించినట్లుంది..
331. నా చెక్కిళ్ళపై చారలు..
కన్నీరు కాదది..
నీ స్మృతుల పలకరింపుల ఆనవాళ్ళు..
332. ప్రకృతో సత్యం చెప్తోంది..
అందమూ పరిమళమూ శాశ్వతం కాదని..
తనలానే జీవనం ఒకనాటికి ఆగక తప్పదని..
333. అనుభూతులకు కొదవేముంది..
అలరించే భావాలుండగా..
అందించే మన్మధుడు మదిలోనుండగా..
334. ఏం మాయ చేస్తేనేమిలే..
నా పేరుకో గమ్మత్తంటింది..
తన పెదవుల తడి తీపులందగానే..
335. నా పలుకు తీపిలే..
మకరందాన్ని పదేపదే వల్లెవేస్తానని..
పెదవులపై తానొచ్చి వాలింది తేనీగ..
336. లేతగులాబీలని పొగొడొద్దన్నానందుకే..
పెదవులు చూసినప్పుడల్లా నిన్ను..
మధుపాలు చుట్టూ చేరతాయనే..
337. అందానికిప్పుడో అతిశయమొచ్చింది..
నీ చూపుల్లోని వెక్కిళ్ళకి..
మనసెందుకు ఊగిందోనని..
338. మధుమాసానికి ముందే నేనొచ్చా..
మల్లెలకాలమంటే నీకిష్టమని
మనసందుకే పరిచి ఉంచుతావని..
339. నేనో భావుకనే..
నాకో ప్రపంచాన్ని సృష్టించుకున్నాక..
అందులో పువ్వులకీ మాటలొచ్చని తెలిసాక..
340. అనుమానమనుకోకు..
నీ మనసున బంధీగా మారి..
ఆ తాళాన్ని పొలిమేరలో విసిరేద్దామని..
No comments:
Post a Comment