Tuesday, 17 November 2015

త్రిపదాలు : 561 to 580

 ............................... *****************.............................

561. తప్పును సవరించుకుంటే చాలేమో..
మార్పును ఆహ్వానిస్తూ..
మంచితనానికి చేయూతనిస్తూ..

562. కొన్ని గమ్యాలంతే..
అలసటను తెలియకుండా చేసి..
ప్రయాణం సుగమం చేస్తూ..

563. ఎంత ఆవేశమో యువతకి..
భవిష్యత్తుని వ్యర్ధం చేసుకుంటూ..
మాదకద్రవ్యాలకీ మత్తుమందులకీ అలవాటుపడుతూ

564. వెలుతురుకు చోటిచ్చా..
చీకటిని సాగనంపుతూ..
మేఘాన్ని కదలమని వేడుకుంటూ..

565. అనుభూతులపర్వమే నా జీవితం..
నీవు అడుగుపెట్టిన వేళావిశేషమనుకుంటా..
నిట్టూర్పులకు నీళ్ళొదిలేసినట్లు..

566. చిగురాకల్లే ఒణుకుతున్నా..
నీ వలపుజల్లులో తడిచిన ప్రతిసారి..
మధుమాసంతో సంబంధం లేనట్లు..

567. నిరంతర చదువరినే..
నిన్ను చదవాలని ప్రయత్నించి ఓడిపోతూ..
లిపిలేని కావ్యమై నువ్వెదురుపడుతుంటే..

568. నువ్వుగానే మిగిలిపోయా..
నీలోకొచ్చి చేరినందుకు..
నేనంటూ ఉన్నానని మరచినందుకు..

569. మూగనైతేనేమి..
నా స్పర్శతోనే సందేశం వినిపించానుగా.. 
నీపై మక్కువను మనసారా తెలిపేసి..

570. వెనుదిరిగిన ఓటమినెందుకు వెక్కిరించడం..
రమ్మంటూ విజయం ఎదురవుతుంటే..
మునుముందుకు అడుగేస్తూ సాగిపోక..

571. మగువకెక్కడుంది స్వేచ్ఛ..
ఆంక్షలవలయం పంజరమై బిగుసుకుంటే..
స్వాతంత్ర్యమన్నది నీటిమూటగా మిగిలిపోతుంటే.. 

572. సవరించాలంటే లోపాలు..
చిత్తశుద్ధి కావాలి లోకులలో..
నవసమాజ నిర్మాణానికి పట్టుదలనే పంతాలలో..

573. శ్రావణం వచ్చేసింది..
నీ మనసు తెలుసుకొనే..
ముంగిట్లో సైతం కురవాలనే..

574. మనసు మేఘం ముసురుకుంది..
ఆవేదన అంబరమంటినందుకే..
కన్నులవెంట కురిసి ఓదార్చుకోవాలనే..

575. ప్రాప్తించిన తీరాలేగా మనవి..
ఎన్నిజన్మలైనా ఎగిసిపడే వీలుందని..
కలకాలమిలాగే కలిసుందామని..

576. ఆ స్పర్శతోనే..
వికసించినా..ముకుళించినా..
మౌనంగా భాషించినా

577. పేరులేని పువ్వైతేనేమి..
ప్రకృతి మందహాసం స్పృసిస్తూనే ఉందిగా..
తను జీవించే ఉందని గుర్తుచేస్తూ..

578. కాలాతీత గాయలెందుకో..
కన్నులనే పట్టిపీడిస్తుంటాయి..
నానాటికీ రుధిరమై స్రవిస్తూ..

579. ఎన్ని కలలు చిదిమేసానో..
నీ వియోగమొచ్చి దరిచేరాక..
నిజం చేసుకొనే మార్గం వెతకలేక..

580. మనోధైర్యాన్ని సాయమడిగా..
విజయ సోపానానికి దారి చూపుతుందని....

మానసిక వ్యధను తుంచేస్తుందని..


 ............................... *****************.............................

No comments:

Post a Comment