............................... *****************.............................
541. మగువ మనసెప్పుడూ లోకువే..
అస్తిత్వాన్ని అభద్రతాభావానికి ముడిపెట్టేంత..
ఆమె నిస్సహాయతను ఎగతాళి చేసేంత..
542. అనుబంధం మెరుస్తోంది..
ఏ జన్మ నెచ్చెలివో..
ఈ జన్మలోనూ కానుకవుతూ..
543. తూరుపునే వికసించా..
నీకు వెలుగులు పంచాలని..
కొబ్బరాకుల నడుమ దారి చీల్చుకొని..
544. ఎంత అదృష్టమో..
ప్రకృతికాంత ఒడిలో పాఠాలు నేర్వడం..
ఆమె సౌందర్యాన్ని ఆరాధించడం..
545. అరుదైన నేస్తానివే..
అచంచలమైన విశ్వాసాన్ని నాలో నింపేస్తూ
అనువదించలేని ఆప్యాయతని అందిస్తూ..
546. నీ అలుకలు గడుసరివే..
మౌనంతో నన్ను కట్టేసి..
మురిపంలో నీలోకి అల్లుకుంటూ..
547. ఆమె ఒక ద్రవపదార్ధమే..
పోసే పాత్రకు తగ్గట్టుగా..
తన రూపం తానే మార్చుకొని సాగిపోతూ..
548. ప్రేమతో మనసు గెలుచుకున్నాను..
మౌనాన్ని శిశిరానికి సాగనంపి..
నీ తలపులతో నిరంతర సావాసం చేసి..
549. గుండె బరువెక్కుతోంది..
క్షణక్షణం నీ స్మృతులు తడుముతుంటే...
నిముషాలు నిస్సహాయంగా నిలబడిపోతుంటే..
550. మంచుబిందువులా నువ్వు..
నిద్దురపొద్దుల్లో తుషారపు గిలిగింతలు పెట్టేలా..
ఉషోదయాన్ని మధూదయంగా మార్చేస్తూ..
551. మకరందంలో ముంచుతున్నా నీ తలపులని..
ప్రతి నిముషం తీయగా తాగాలనే..
నీ జ్ఞాపకాన్ని అమరం చేద్దామనే..
552. కొన్ని కన్నీళ్ళంతే..
ఆగకుండా ప్రవహించి ఉనికి చాటుకుంటాయి..
ఎదుటివారి మనసుకు గుబులు పుట్టిస్తూ..
553. చందమామ నవ్వినట్లుంది..
అసమానంగా వెలుగుతున్న నీ మోములో..
మరకలు మచ్చుతునకైనా లేనందుకు..
554. అక్షరమాల అదృష్టమేమో..
నీ పదాలలో ఇమిడిపోతూ..
నీ భావంలో ఒదిగిపోతూ.
555. లయ తప్పని నర్తనమే నీది..
నా హృదయాన్ని వేదిక చేసాననేమో..
మరింత విజృంభించి మైమరచిపోతూ..
556. దుర్గంధం తప్పదు..
మనసు నిండా మాలిన్యమే నింపుకుంటే..
పశ్చాత్తాపం, అంతఃకరణ అనేదే తెలియకుంటే..
557. తరమక తప్పదు..
నిన్న చేసిన పాపమేదో..
మృత్యువుకు దగ్గర చేస్తూ..
558. తొంగి చూస్తున్నవి..
నింగిలోని నక్షత్రాలు..
నీ గుమ్మానికి తోరణం కావాలనే
559. కాలిపోతూనే ఉంటాయి..
క్షణకాలపు వేడిమిలో..
యవ్వనపు తుళ్ళింతలు..
560. అద్దకం వేయాలనుకున్నా..
జారిపోయిన నీ కలలను చేపట్టి..
చీరలో చేర్చి నీకు బహూకరిద్దామనే..
............................... *****************.............................
541. మగువ మనసెప్పుడూ లోకువే..
అస్తిత్వాన్ని అభద్రతాభావానికి ముడిపెట్టేంత..
ఆమె నిస్సహాయతను ఎగతాళి చేసేంత..
542. అనుబంధం మెరుస్తోంది..
ఏ జన్మ నెచ్చెలివో..
ఈ జన్మలోనూ కానుకవుతూ..
543. తూరుపునే వికసించా..
నీకు వెలుగులు పంచాలని..
కొబ్బరాకుల నడుమ దారి చీల్చుకొని..
544. ఎంత అదృష్టమో..
ప్రకృతికాంత ఒడిలో పాఠాలు నేర్వడం..
ఆమె సౌందర్యాన్ని ఆరాధించడం..
545. అరుదైన నేస్తానివే..
అచంచలమైన విశ్వాసాన్ని నాలో నింపేస్తూ
అనువదించలేని ఆప్యాయతని అందిస్తూ..
546. నీ అలుకలు గడుసరివే..
మౌనంతో నన్ను కట్టేసి..
మురిపంలో నీలోకి అల్లుకుంటూ..
547. ఆమె ఒక ద్రవపదార్ధమే..
పోసే పాత్రకు తగ్గట్టుగా..
తన రూపం తానే మార్చుకొని సాగిపోతూ..
548. ప్రేమతో మనసు గెలుచుకున్నాను..
మౌనాన్ని శిశిరానికి సాగనంపి..
నీ తలపులతో నిరంతర సావాసం చేసి..
549. గుండె బరువెక్కుతోంది..
క్షణక్షణం నీ స్మృతులు తడుముతుంటే...
నిముషాలు నిస్సహాయంగా నిలబడిపోతుంటే..
550. మంచుబిందువులా నువ్వు..
నిద్దురపొద్దుల్లో తుషారపు గిలిగింతలు పెట్టేలా..
ఉషోదయాన్ని మధూదయంగా మార్చేస్తూ..
551. మకరందంలో ముంచుతున్నా నీ తలపులని..
ప్రతి నిముషం తీయగా తాగాలనే..
నీ జ్ఞాపకాన్ని అమరం చేద్దామనే..
552. కొన్ని కన్నీళ్ళంతే..
ఆగకుండా ప్రవహించి ఉనికి చాటుకుంటాయి..
ఎదుటివారి మనసుకు గుబులు పుట్టిస్తూ..
553. చందమామ నవ్వినట్లుంది..
అసమానంగా వెలుగుతున్న నీ మోములో..
మరకలు మచ్చుతునకైనా లేనందుకు..
554. అక్షరమాల అదృష్టమేమో..
నీ పదాలలో ఇమిడిపోతూ..
నీ భావంలో ఒదిగిపోతూ.
555. లయ తప్పని నర్తనమే నీది..
నా హృదయాన్ని వేదిక చేసాననేమో..
మరింత విజృంభించి మైమరచిపోతూ..
556. దుర్గంధం తప్పదు..
మనసు నిండా మాలిన్యమే నింపుకుంటే..
పశ్చాత్తాపం, అంతఃకరణ అనేదే తెలియకుంటే..
557. తరమక తప్పదు..
నిన్న చేసిన పాపమేదో..
మృత్యువుకు దగ్గర చేస్తూ..
558. తొంగి చూస్తున్నవి..
నింగిలోని నక్షత్రాలు..
నీ గుమ్మానికి తోరణం కావాలనే
559. కాలిపోతూనే ఉంటాయి..
క్షణకాలపు వేడిమిలో..
యవ్వనపు తుళ్ళింతలు..
560. అద్దకం వేయాలనుకున్నా..
జారిపోయిన నీ కలలను చేపట్టి..
చీరలో చేర్చి నీకు బహూకరిద్దామనే..
No comments:
Post a Comment