141. చైత్రరథం సిద్దమయ్యింది..
చెలిమిని ఊరేగించేందుకు..
ఆమని పాటను వ్యాపింపచేసేందుకు..
142. వెదురుకొమ్మలు దాటొచ్చిన గాలేమో అది
ఈలేసి నిన్ను పిలిచినట్లు..
వేణు మాధవుని ఉనికి నీకు చెప్పినట్లు..
143. వనదేవతై ఎదురు చూస్తున్నా..
అతిథివై వస్తావని..
వసంతాన్ని మెచ్చుకుంటావని,,
144. గమకాలు నేర్చిన పిల్లగాలి..
నీకు రాగాలంటే ప్రియమని..
నిన్ను మత్తెక్కించే ప్రయత్నమది..
145. అందెలు నవ్వుకున్నాయి..
తన రవాలు నీ పెదవుల్లో చేరాయని..
నీ నవ్వులు తాము తెచ్చుకున్నాయని..
146. తనువు సెలయేరవుతోంది..
నీ లాలనకు మనసు కరుగుతుంటే..
నీ లాలిమ నా చెక్కిళ్ళనంటుతుంటే..
147. సుమాలను పూసుకుంది..
సుగంధాలను నింపుకోవాలనే..
సౌరభాలను వెదజల్లాలనే..
148. చెక్కిలి చెంగల్వయ్యింది..
ఏకాంతంలో కలవమన్నావనే..
పరవశాలను ఊహిస్తూనే...
149. మధురిమనై వాలాను..
పెదవుల్లో తేనెలు నింపుతూ..
అరుణిమను అధరాలకు అద్దుతూ..
150. పున్నాగుపూలలో అల్లికనే..
నిన్ను పరిమళమై హత్తుకొనే వేళ..
దారమెరుగని దూరాలు తీసే వేళ
151. మత్తేభమై వస్తున్నా...
నువ్వు ముచ్చటగా పిలిచావనే
నీ మురిపాలను తీర్చాలనే..
152. అందెలు చిన్నబోయాయి..
నీ నవ్వులో సవ్వడి వినబడినందుకే..
ఆ సవ్వడి తనదైనందుకే..
153. రాయాలనుకున్నా భావగీతిని..
నాలోని నీ అనుభూతిని..
నా ఊహలోని వసంతాన్ని..
154. మత్తెక్కించే కోకిలగానాల..
మైమరపించె వేణునాదాల..
నీ పెదవి దాటని పాటను నేనేగా.
155. వినోదమెక్కువే నా నయనాలకి..
నీ చూపుల బాణాలకి..
నన్నంటే విరితూపుల మందారాలకి..
156. మనసద్దం ముక్కలయ్యింది..
నన్ను నాకే కనపడనివ్వక విరుచుకుపడి..
ప్రతీముక్కలోనూ నిన్నే చూపిస్తూ మరీ..
157. అర్చనకై ఎదురుచూస్తావెందుకలా...
ఆరాధిస్తున్నానని తెలియనందుకా..
నా మూగనోము నచ్చనందుకా..
158. అర్చిస్తూనే ఉంటా..
ఆఖరి శ్వాసవరకూ..
నా మదిలో నీ రూపం కొలువయ్యుందనే..
159. అర్చనలెప్పుడు అందుకుంటావో..
నిత్యాభిషేకాలలో తడుస్తూ..
భావమకరందంలో తేలుతూంటే..
160. పూసేకొద్దీ మల్లెలు..
అలరించేకొద్దీ మనసులు..
పరవశించేకొద్దీ పూజలు..
చెలిమిని ఊరేగించేందుకు..
ఆమని పాటను వ్యాపింపచేసేందుకు..
142. వెదురుకొమ్మలు దాటొచ్చిన గాలేమో అది
ఈలేసి నిన్ను పిలిచినట్లు..
వేణు మాధవుని ఉనికి నీకు చెప్పినట్లు..
143. వనదేవతై ఎదురు చూస్తున్నా..
అతిథివై వస్తావని..
వసంతాన్ని మెచ్చుకుంటావని,,
144. గమకాలు నేర్చిన పిల్లగాలి..
నీకు రాగాలంటే ప్రియమని..
నిన్ను మత్తెక్కించే ప్రయత్నమది..
145. అందెలు నవ్వుకున్నాయి..
తన రవాలు నీ పెదవుల్లో చేరాయని..
నీ నవ్వులు తాము తెచ్చుకున్నాయని..
146. తనువు సెలయేరవుతోంది..
నీ లాలనకు మనసు కరుగుతుంటే..
నీ లాలిమ నా చెక్కిళ్ళనంటుతుంటే..
147. సుమాలను పూసుకుంది..
సుగంధాలను నింపుకోవాలనే..
సౌరభాలను వెదజల్లాలనే..
148. చెక్కిలి చెంగల్వయ్యింది..
ఏకాంతంలో కలవమన్నావనే..
పరవశాలను ఊహిస్తూనే...
149. మధురిమనై వాలాను..
పెదవుల్లో తేనెలు నింపుతూ..
అరుణిమను అధరాలకు అద్దుతూ..
150. పున్నాగుపూలలో అల్లికనే..
నిన్ను పరిమళమై హత్తుకొనే వేళ..
దారమెరుగని దూరాలు తీసే వేళ
151. మత్తేభమై వస్తున్నా...
నువ్వు ముచ్చటగా పిలిచావనే
నీ మురిపాలను తీర్చాలనే..
152. అందెలు చిన్నబోయాయి..
నీ నవ్వులో సవ్వడి వినబడినందుకే..
ఆ సవ్వడి తనదైనందుకే..
153. రాయాలనుకున్నా భావగీతిని..
నాలోని నీ అనుభూతిని..
నా ఊహలోని వసంతాన్ని..
154. మత్తెక్కించే కోకిలగానాల..
మైమరపించె వేణునాదాల..
నీ పెదవి దాటని పాటను నేనేగా.
155. వినోదమెక్కువే నా నయనాలకి..
నీ చూపుల బాణాలకి..
నన్నంటే విరితూపుల మందారాలకి..
156. మనసద్దం ముక్కలయ్యింది..
నన్ను నాకే కనపడనివ్వక విరుచుకుపడి..
ప్రతీముక్కలోనూ నిన్నే చూపిస్తూ మరీ..
157. అర్చనకై ఎదురుచూస్తావెందుకలా...
ఆరాధిస్తున్నానని తెలియనందుకా..
నా మూగనోము నచ్చనందుకా..
158. అర్చిస్తూనే ఉంటా..
ఆఖరి శ్వాసవరకూ..
నా మదిలో నీ రూపం కొలువయ్యుందనే..
159. అర్చనలెప్పుడు అందుకుంటావో..
నిత్యాభిషేకాలలో తడుస్తూ..
భావమకరందంలో తేలుతూంటే..
160. పూసేకొద్దీ మల్లెలు..
అలరించేకొద్దీ మనసులు..
పరవశించేకొద్దీ పూజలు..
No comments:
Post a Comment