Tuesday, 17 November 2015

త్రిపదాలు : 201 to 220


201. వెంట్రుకవాసి లోపమే..
నీ చేతికి చిక్కేవరకూ ఆనందం..
ఆమాడ దూరంలో నిన్నూరిస్తూ..
202. ఎన్ని పచ్చదనాల మొలకలో..
మదిని నిత్యవసంతం చేసేస్తూ..
స్మృతులవాకిట్లోకి నన్ను ఆహ్వానిస్తూ..
203. అమ్మెప్పుడూ అమృతమే..
తన ప్రేమలో ముంచితీస్తూ..
కేవలం తీపిని మాత్రమే రంగరిస్తూ..
204. ముందు మనుషులు మారాలేమో..
తన జీవితంలో ఉత్సాహముంటే కదా..
సమాజాన్ని మార్చే శక్తి సమకూరేది..
205. మనసు చిలకయ్యింది..
పంచెవన్నెలను పూసుకొని..
హరివిల్లుతో పోటీ పడాలనే..
206. పెదవికెన్ని ఒంపులో..
నెలవంకగా ఒయ్యరమవుతూ..
ప్రతీవంపుతో నిన్నే ఊరిస్తూ..
207. కనుల కావ్యాలు రాసేయనా..
రెప్పల్ల మాటున నిన్ను నింపుకొని..
నయనాల లాస్యాలు నర్తించేలా..
208. నవ్వుల నావలో పయనమై వస్తున్నా...
పరిమళ సంపెంగలని తెస్తున్నా..
నీ మౌనాన్ని పద్మరాగముతో అలంకరించాలనే..
209. చెలిమెప్పుడూ ఉన్నతమైనదే..
చెలిమి చేసేవారివి చిన్నబుద్ధులైనా...
చెరుకుతీపి మాత్రం చెరపలేనిదే చెలిమిలో..
210. మనసు విహంగమవుతోంది..
మధురోహల ఆకాశంలో..
రెక్కలతో పనిలేని సంతోషసమ్రంభంలో..
211. వెన్నెలపువ్వై పులకరిస్తున్నా...
ఆకాశమై ఆదరించావని..
ఆనందమై పలకరించావని..
212. అభిమానానికి విలువిస్తే చాలు..
అభిమానులు వారే అవుతారు..
అనురాగానికి బానిసలవుతారు..
213. ఆనందమై వర్షిస్తున్నా..
స్వాతిముత్యమై నీవు వేచి ఉన్నావనే..
నీలో ఒదిగి మెరవాలనే..
214. మనసు నిండినందుకేమో..
స్వార్ధం పొంగుతోంది..
మనుషులనుండీ వాడ్ని వేరు చేసేస్తూ..
215. ఒంటరితనం మాలిమయ్యింది..
కన్నులు నిద్దురను దూరం పెట్టాయనే..
నీరవంలో వేరే గమ్యమేదీ లేదనే..
216. చూపులు చిలికిన మౌనాలు..
వెన్నెలదుప్పటిలో నన్ను దాచేస్తూ..
నిన్ను చేరువ చేస్తూ నాకు..
217. తారలతో స్ఫూర్తి పొందా..
మిణుకుమని చిన్నగా మెరవాలని..
వినీలాకాశానికి అందం నేనే కావాలని..
218. నిన్న లేని విచారమేదో నాలో..
నీ విరహపు స్మృతుల సవ్వడిలో..
నన్ను ఓదార్పుకు దూరం చేస్తూ...
219. నవ్వులను దూరం చేసుకున్నా..
నీ విరహానికి చేరువైన నేను..
నాకు నేనే కొత్తగా అగుపిస్తూ..
220. బూడిదవుతున్న ఆప్యాయతలు..
రచ్చకెక్కిన సంఘర్షణల్లో..
బలహీనమవుతున్న బంధాలతో..

No comments:

Post a Comment