41. అందుకోవాలనే ప్రయత్నిస్తుంటా ఆకాశాన్ని..
అవకాశాలు మృగ్యమవుతున్నా..
స్వయంకృషినే నమ్ముకొని..
42. నువ్వో ఆకాశమే నాకెప్పుడూ..
ఇంద్రధనస్సు అంచుల నుండీ..
నాకోసం ఆత్మీకరించుకున్నాక..
43. అందీ అందనిదనుకున్నా ఆకాశం..
తరళ నీలిమలు నా చుట్టూ పరిభ్రమించనప్పుడు
పడగలెత్తి మనసు నర్తించనప్పుడు..
44. అనురాగం ఆకాశమైనందుకేమో..
నీలివర్ణం కెంజాయిగా మారి..
సరికొత్తగా కనువిందయ్యింది ప్రకృతి..
45. సంధ్యారాగాన్ని చిత్రించాలనుకున్నా..
కుసుమించిన ఆనందంతో ఆకాశం..
కెంజాయిరంగుని పులుముకోగానే
46. చెంగావి చీర కట్టిందెందుకో ఆకాశం..
నా మదిలోని ఊహానుభవం..
కవితాత్మగా కనపడాలనేమో..
47. మౌనం పలికే భావాలెన్నో..
చూపుల కావ్యంలో పరిమళించేవి..
మాటల్లోనికి సైతం అనువదించలేనివి..
48. కొంగు పట్టుకు తిరిగేనీకు..
తలపుల్లో తిరిగే అవసరమేముందిలే..
వియోగాన్ని వేడుక చేసుకోవడమనే కోరికెందుకులే..
49. కొన్ని భావాలంతే..
కలిసిపోతుంటాయి..
చిరునవ్వులు రెండు ఏకమైనట్లు..
50. కలసిన చూపులకే కలవరపడతావెందుకో..
మనసులేకమయ్యే మధురక్షణాలు
మన ముందే ఉండగా..
51. నింగీనేలా కలిసినట్లనిపించే విచిత్రం..
మన ఊహను చిత్రించుకొమ్మనే సౌందర్యం..
ప్రకృతి మనకిచ్చిన అవకాశం..
52. అనుమానం తొలగిపోయింది..
నీ చేయి పట్టాక..
రేపన్నది నిశ్చయంగా మధురమేనని..
53. చీకటికి చింతిస్తావెందుకో..
వెన్నెలై నేనుండగా..
రాతిరికై ఎదురుచూపుల తోరణాలు గుచ్చుకోక...
54. మరో జన్మకై ఎదురుచూస్తున్నా..
మదిలో చంచలత్వాన్ని దాచుకుంటూ
బాల్యంపై బెంగపడ్డప్పుడల్లా..
55. సింధూరం కరుగుతోంది..
అతని రాకతో..
వయసుకి ప్రణయమొచ్చి..
56. ఊహల వెల్లువలు..
నీ జ్ఞాపకాల తుంపర్లకి..
మదిలో గిలిగింతలవుతుంటే
57. నేనో ప్రత్యుషాన్నే..
ఆకాశంలో వెలుగులీనుతూ..
ఇంద్రధనస్సుని ప్రజ్వలించేవేళ
58. నీ జతిలోనే ఆడాలనుంది..
అడుగులు కదపాలనుకున్న ప్రతిసారీ
ఆనందం పడగలెత్తి ఇంద్రధస్సవుతుంటే..
59. నీరాజనాలెన్నిచ్చినా సరిపోవుగా
అందాన్ని ఆరాధించే శిల్పివైన నీకు
మనసాకృతిగా నా మదిలో నిలిచినందుకు..
60. పులి చేతిలో మేక పిల్ల ఆమె
మనసులేని మనువాడినందుకు
జీతమక్కరలేని దాసీగా మారినందుకు..
అవకాశాలు మృగ్యమవుతున్నా..
స్వయంకృషినే నమ్ముకొని..
42. నువ్వో ఆకాశమే నాకెప్పుడూ..
ఇంద్రధనస్సు అంచుల నుండీ..
నాకోసం ఆత్మీకరించుకున్నాక..
43. అందీ అందనిదనుకున్నా ఆకాశం..
తరళ నీలిమలు నా చుట్టూ పరిభ్రమించనప్పుడు
పడగలెత్తి మనసు నర్తించనప్పుడు..
44. అనురాగం ఆకాశమైనందుకేమో..
నీలివర్ణం కెంజాయిగా మారి..
సరికొత్తగా కనువిందయ్యింది ప్రకృతి..
45. సంధ్యారాగాన్ని చిత్రించాలనుకున్నా..
కుసుమించిన ఆనందంతో ఆకాశం..
కెంజాయిరంగుని పులుముకోగానే
46. చెంగావి చీర కట్టిందెందుకో ఆకాశం..
నా మదిలోని ఊహానుభవం..
కవితాత్మగా కనపడాలనేమో..
47. మౌనం పలికే భావాలెన్నో..
చూపుల కావ్యంలో పరిమళించేవి..
మాటల్లోనికి సైతం అనువదించలేనివి..
48. కొంగు పట్టుకు తిరిగేనీకు..
తలపుల్లో తిరిగే అవసరమేముందిలే..
వియోగాన్ని వేడుక చేసుకోవడమనే కోరికెందుకులే..
49. కొన్ని భావాలంతే..
కలిసిపోతుంటాయి..
చిరునవ్వులు రెండు ఏకమైనట్లు..
50. కలసిన చూపులకే కలవరపడతావెందుకో..
మనసులేకమయ్యే మధురక్షణాలు
మన ముందే ఉండగా..
51. నింగీనేలా కలిసినట్లనిపించే విచిత్రం..
మన ఊహను చిత్రించుకొమ్మనే సౌందర్యం..
ప్రకృతి మనకిచ్చిన అవకాశం..
52. అనుమానం తొలగిపోయింది..
నీ చేయి పట్టాక..
రేపన్నది నిశ్చయంగా మధురమేనని..
53. చీకటికి చింతిస్తావెందుకో..
వెన్నెలై నేనుండగా..
రాతిరికై ఎదురుచూపుల తోరణాలు గుచ్చుకోక...
54. మరో జన్మకై ఎదురుచూస్తున్నా..
మదిలో చంచలత్వాన్ని దాచుకుంటూ
బాల్యంపై బెంగపడ్డప్పుడల్లా..
55. సింధూరం కరుగుతోంది..
అతని రాకతో..
వయసుకి ప్రణయమొచ్చి..
56. ఊహల వెల్లువలు..
నీ జ్ఞాపకాల తుంపర్లకి..
మదిలో గిలిగింతలవుతుంటే
57. నేనో ప్రత్యుషాన్నే..
ఆకాశంలో వెలుగులీనుతూ..
ఇంద్రధనస్సుని ప్రజ్వలించేవేళ
58. నీ జతిలోనే ఆడాలనుంది..
అడుగులు కదపాలనుకున్న ప్రతిసారీ
ఆనందం పడగలెత్తి ఇంద్రధస్సవుతుంటే..
59. నీరాజనాలెన్నిచ్చినా సరిపోవుగా
అందాన్ని ఆరాధించే శిల్పివైన నీకు
మనసాకృతిగా నా మదిలో నిలిచినందుకు..
60. పులి చేతిలో మేక పిల్ల ఆమె
మనసులేని మనువాడినందుకు
జీతమక్కరలేని దాసీగా మారినందుకు..
No comments:
Post a Comment