21. నెమలి కన్నులనే అరువడగాలేమో..
మహాసుందరుడైన నిన్ను తిలకించాలంటే..
నీ కమలలోచనాలతో కన్నులు కలపాలంటే..
22. మా ఇంటికొస్తావనే అనుకుంటున్నా..
ముద్దుగారే నిన్ను యశోదనై పిలిచానని..
విశ్వరూపాన్ని నోట నాకు చూపించాలని..
23. నెమలి పింఛమైనా కాకపోతిని..
నీ శిరమును అలంకరింప..
గోపికల మనసును దోచే నీకు వదనశోభనివ్వ..
24. వచ్చేసానిదిగో..
కలిగి తారలు నాట్యమాడే వేళ..
నీ చూపుకు పండుగిచ్చే వెన్నెలకన్నెలా..
25. నిన్నటిదాకా నాదో పేరనే అనుకున్నా..
నువ్వో కవితగా మలచి..
నన్నో నాయికను చేసేవరకూ..
26. అక్షరాలకెంత వేదనో..
పగిలిన హృదయాన్ని రాసే వేళ..
నిన్ను తలచుకు రోదిస్తుంటే..
27. వసంతమొచ్చిందని సంబరపడ్డా..
కోయిల కూతేదీ వినబడక విస్తుపోయా..
తీరా కిటికీ తెరిస్తే కాంక్రీటు అరణ్యం తప్ప కొమ్మే కనపడలేదు..
28. ఇంద్రధనసే సరిపోదంటున్నా..
నే వలచిన కలలలో..
రంగులు కోకొల్లలై కనబడుతుంటుంటే..
29. నా ఊహల కోయిలలకెన్ని రంగులో..
ప్రతి ఋతువునూ మధుమాసం చేసేవేళ
మదిని మెలిక పరవళ్ళు తిప్పుతూ..
30. నిద్దురనెంతని వరిస్తావో..
వాస్తవమై నీ ముందున్నా..
కలలనే కౌగిలిస్తానంటూ నువ్వు..
31. దూదిపెంజెలా ఎగిరిపోతున్నా..
ఊహల తాకిడిలో నేను..
మబ్బులను చేరి ఊయలూగాలనే..
32. నిన్నటి కలల్లో బ్రతకట్లేదందుకే..
రేపటి వాస్తవానికై ఉరకలెత్తాలని..
ఈరోజే స్వయంకృషిలో పడుతున్నా..
33. అరచేతిలో స్వర్గమంటే ఏమోననుకున్నా..
కొన్ని ఊహలు దోసిట్లో కొచ్చేవరకూ..
వెన్నెలను ముంగిట్లో దించేవరకూ..
34. మువ్వన్నెల పదాలతో..
ముక్కోటి హృదయాలను దోచే మంత్రాలు..
ముచ్చటైన మూడు వరుసల త్రిపదాలు..
35. నీ హృదయంలో..
నేనో కవిత..
చింత్రించాలనుకుంటే గీత..
36. వెన్నెల్లో పొదరిల్లెందుకనుకున్నా..
హృదయంలో కూసింత చోటిచ్చాక..
గిజిగాడినై నేనే నిన్నల్లుకున్నాక..
37. అక్షరాలెన్ని ఆరా తీయాలో..
పరిధి లేని నా ప్రేమ కవిత్వంలో..
నిన్ను రాయాలని నేననుకుంటే..
38. నీ తమాషా మాటలకే మత్తిల్లుతున్నా..
నక్షత్రాలు నేల రాలితే..
వేకువ పారిజాతాలై నన్ను మురిపిస్తాయేమోనని..
39. అనుబంధాలన్నీ అతుకులబొంతలే..
చిల్లులను దాచేసుకుంటూ..
పైకి ప్రేమలు నటించేస్తూ..
40. ఆకాశం చిన్నబోయింది..
తనను మించిన వ్యక్తిత్వాలు..
నేల మీద నడుస్తూండటం చూసి..
మహాసుందరుడైన నిన్ను తిలకించాలంటే..
నీ కమలలోచనాలతో కన్నులు కలపాలంటే..
22. మా ఇంటికొస్తావనే అనుకుంటున్నా..
ముద్దుగారే నిన్ను యశోదనై పిలిచానని..
విశ్వరూపాన్ని నోట నాకు చూపించాలని..
23. నెమలి పింఛమైనా కాకపోతిని..
నీ శిరమును అలంకరింప..
గోపికల మనసును దోచే నీకు వదనశోభనివ్వ..
24. వచ్చేసానిదిగో..
కలిగి తారలు నాట్యమాడే వేళ..
నీ చూపుకు పండుగిచ్చే వెన్నెలకన్నెలా..
25. నిన్నటిదాకా నాదో పేరనే అనుకున్నా..
నువ్వో కవితగా మలచి..
నన్నో నాయికను చేసేవరకూ..
26. అక్షరాలకెంత వేదనో..
పగిలిన హృదయాన్ని రాసే వేళ..
నిన్ను తలచుకు రోదిస్తుంటే..
27. వసంతమొచ్చిందని సంబరపడ్డా..
కోయిల కూతేదీ వినబడక విస్తుపోయా..
తీరా కిటికీ తెరిస్తే కాంక్రీటు అరణ్యం తప్ప కొమ్మే కనపడలేదు..
28. ఇంద్రధనసే సరిపోదంటున్నా..
నే వలచిన కలలలో..
రంగులు కోకొల్లలై కనబడుతుంటుంటే..
29. నా ఊహల కోయిలలకెన్ని రంగులో..
ప్రతి ఋతువునూ మధుమాసం చేసేవేళ
మదిని మెలిక పరవళ్ళు తిప్పుతూ..
30. నిద్దురనెంతని వరిస్తావో..
వాస్తవమై నీ ముందున్నా..
కలలనే కౌగిలిస్తానంటూ నువ్వు..
31. దూదిపెంజెలా ఎగిరిపోతున్నా..
ఊహల తాకిడిలో నేను..
మబ్బులను చేరి ఊయలూగాలనే..
32. నిన్నటి కలల్లో బ్రతకట్లేదందుకే..
రేపటి వాస్తవానికై ఉరకలెత్తాలని..
ఈరోజే స్వయంకృషిలో పడుతున్నా..
33. అరచేతిలో స్వర్గమంటే ఏమోననుకున్నా..
కొన్ని ఊహలు దోసిట్లో కొచ్చేవరకూ..
వెన్నెలను ముంగిట్లో దించేవరకూ..
34. మువ్వన్నెల పదాలతో..
ముక్కోటి హృదయాలను దోచే మంత్రాలు..
ముచ్చటైన మూడు వరుసల త్రిపదాలు..
35. నీ హృదయంలో..
నేనో కవిత..
చింత్రించాలనుకుంటే గీత..
36. వెన్నెల్లో పొదరిల్లెందుకనుకున్నా..
హృదయంలో కూసింత చోటిచ్చాక..
గిజిగాడినై నేనే నిన్నల్లుకున్నాక..
37. అక్షరాలెన్ని ఆరా తీయాలో..
పరిధి లేని నా ప్రేమ కవిత్వంలో..
నిన్ను రాయాలని నేననుకుంటే..
38. నీ తమాషా మాటలకే మత్తిల్లుతున్నా..
నక్షత్రాలు నేల రాలితే..
వేకువ పారిజాతాలై నన్ను మురిపిస్తాయేమోనని..
39. అనుబంధాలన్నీ అతుకులబొంతలే..
చిల్లులను దాచేసుకుంటూ..
పైకి ప్రేమలు నటించేస్తూ..
40. ఆకాశం చిన్నబోయింది..
తనను మించిన వ్యక్తిత్వాలు..
నేల మీద నడుస్తూండటం చూసి..
No comments:
Post a Comment