221. విడదీయ వీలులేనివే కొన్ని అనుబంధాలు..
ఆహాలపొరలెన్ని కమ్ముకున్నా బంధాల కౌగిళ్ళలో..
కడపటికి ఏకమవును కన్నీటిధారలో..
222. తేనె చినుకులే నీ పలుకులు..
తీయగా నను పలకరిస్తూ..
మెత్తగా మది పులకరిస్తూ..
223. ఆహ్వానిస్తున్నా ఆ నవ్వుని..మనసుపొరలను తాకుతుంటే..
దూరాలను చెరిపేసి..అడుగులు కలిపేసి..
లక్ష్యాన్ని కలిసి సాధిద్దామని..
224. ఏరుకున్నా నీ చిరునవ్వులు..
మనసు రాయాలనుకున్న మధురలేఖల్లో..
పూమెత్తగా గుప్పించాలని...
225. కొత్తగా పరిచయమవ్వాలనుకున్నా..
పాత దుఃఖానికి వీడ్కోలిచ్చి..
నవోదయానికి నాంది పలకాలని..
226. రవళిస్తున్న ఆనందం..
రెక్కలొచ్చిన గాలిపటమై..
హద్దులేని ఆకాశాన్ని చుంబిస్తూ..
227. ద్వేషానికి రంగులేయడమేమిటో..
నటించరాని ముఖకవళికల్లో..
ఎరుపునంతా చూపులతోనే కుమ్మరిస్తూ..
228. సిరివెన్నెలైంది మది ..
బంధాలు పరిమళించే గంధాలను గుర్తుకుతెస్తుంటే.
భావవీచికలు గిలిగింతలై పెనవేస్తుంటే..
229. ఎంత అల్లరో నీ కన్నుల్లో..
హేమంతాన్ని గుదిగుచ్చి రాస్తుంటే..
మంచుతెరలకే మత్తిల్లి మురిసినట్లు..
230. పుష్పక విమానమెందుకనుకున్నా..
నీ హృదయంలో నన్ను విహారానికి పిలిచి..
మధురమైన ఆతిధ్యం అందిస్తుంటే..
231. విస్తుపోతున్న వలపొకటి..
తలపుల తలుపులు తెరవకుండానే..
కలలోకి తోసుకొచ్చే నిన్ను చూసి..
232. వెన్నెలపాటని రాయాలని కూర్చున్నా..
కలానికి జాబిల్లిని చూపుతూ..
నీవే వెలుతురై వస్తావని తెలియక..
233. కలల యవనికలో దాగావెందుకో..
మనసుపొరలలో సౌఖ్యం కరువై..
ఆనందకాంతులకు దూరమయ్యావనా..
234. ప్రతిస్పందనకై ఎదురుచూస్తున్నా..
ఆరాధించిన నీ మనసు మూగబోయిందేమని..
రాగాలకోయిలైన నువ్వు కనుమరుగయ్యావని..
235. అహమూ అలంకారమవుతోంది..
ప్రేమను కాదని కొన్ని హృదయాలలో..
చిచ్చు పెట్టి అనుబంధాలలో..
236. చడీ చప్పుడూ లేక కురిసిందనుకున్నా..
నీ ప్రేమ రంగులు పులుముకొని...
వెలుగుపూవై విరిసిందని గుర్తించక..
237. రెక్కలు తొడిగిన ఉల్లాసమొకటి..
సల్లపమంతా అక్షరాల్లోకి అనువదించుకుంటూ..
భావంగా తనను రాయమంటూ..
238. కావ్యసరస్సొకటి వెలిసింది..
కవనాలన్నీ గర్భాన దాచుకొని నిన్నాహ్వానిస్తూ..
నిన్ను నువ్వు మరచేలా మునిగిద్దామని..
239. తమకు తామే అలంకరించుకున్న పెదవులు..
నీ పెదవులను చేరడమే తమకానందమంటూ..
చిరునవ్వుగా మారి నీకు చేరువవుతూ
240. చెదిరిపోని స్వప్నంలా నువ్వు..
పగటినిద్రనూ పాడు చేస్తూ..
మరచిన గాయాన్ని గుర్తుచేస్తూ..
ఆహాలపొరలెన్ని కమ్ముకున్నా బంధాల కౌగిళ్ళలో..
కడపటికి ఏకమవును కన్నీటిధారలో..
222. తేనె చినుకులే నీ పలుకులు..
తీయగా నను పలకరిస్తూ..
మెత్తగా మది పులకరిస్తూ..
223. ఆహ్వానిస్తున్నా ఆ నవ్వుని..మనసుపొరలను తాకుతుంటే..
దూరాలను చెరిపేసి..అడుగులు కలిపేసి..
లక్ష్యాన్ని కలిసి సాధిద్దామని..
224. ఏరుకున్నా నీ చిరునవ్వులు..
మనసు రాయాలనుకున్న మధురలేఖల్లో..
పూమెత్తగా గుప్పించాలని...
225. కొత్తగా పరిచయమవ్వాలనుకున్నా..
పాత దుఃఖానికి వీడ్కోలిచ్చి..
నవోదయానికి నాంది పలకాలని..
226. రవళిస్తున్న ఆనందం..
రెక్కలొచ్చిన గాలిపటమై..
హద్దులేని ఆకాశాన్ని చుంబిస్తూ..
227. ద్వేషానికి రంగులేయడమేమిటో..
నటించరాని ముఖకవళికల్లో..
ఎరుపునంతా చూపులతోనే కుమ్మరిస్తూ..
228. సిరివెన్నెలైంది మది ..
బంధాలు పరిమళించే గంధాలను గుర్తుకుతెస్తుంటే.
భావవీచికలు గిలిగింతలై పెనవేస్తుంటే..
229. ఎంత అల్లరో నీ కన్నుల్లో..
హేమంతాన్ని గుదిగుచ్చి రాస్తుంటే..
మంచుతెరలకే మత్తిల్లి మురిసినట్లు..
230. పుష్పక విమానమెందుకనుకున్నా..
నీ హృదయంలో నన్ను విహారానికి పిలిచి..
మధురమైన ఆతిధ్యం అందిస్తుంటే..
231. విస్తుపోతున్న వలపొకటి..
తలపుల తలుపులు తెరవకుండానే..
కలలోకి తోసుకొచ్చే నిన్ను చూసి..
232. వెన్నెలపాటని రాయాలని కూర్చున్నా..
కలానికి జాబిల్లిని చూపుతూ..
నీవే వెలుతురై వస్తావని తెలియక..
233. కలల యవనికలో దాగావెందుకో..
మనసుపొరలలో సౌఖ్యం కరువై..
ఆనందకాంతులకు దూరమయ్యావనా..
234. ప్రతిస్పందనకై ఎదురుచూస్తున్నా..
ఆరాధించిన నీ మనసు మూగబోయిందేమని..
రాగాలకోయిలైన నువ్వు కనుమరుగయ్యావని..
235. అహమూ అలంకారమవుతోంది..
ప్రేమను కాదని కొన్ని హృదయాలలో..
చిచ్చు పెట్టి అనుబంధాలలో..
236. చడీ చప్పుడూ లేక కురిసిందనుకున్నా..
నీ ప్రేమ రంగులు పులుముకొని...
వెలుగుపూవై విరిసిందని గుర్తించక..
237. రెక్కలు తొడిగిన ఉల్లాసమొకటి..
సల్లపమంతా అక్షరాల్లోకి అనువదించుకుంటూ..
భావంగా తనను రాయమంటూ..
238. కావ్యసరస్సొకటి వెలిసింది..
కవనాలన్నీ గర్భాన దాచుకొని నిన్నాహ్వానిస్తూ..
నిన్ను నువ్వు మరచేలా మునిగిద్దామని..
239. తమకు తామే అలంకరించుకున్న పెదవులు..
నీ పెదవులను చేరడమే తమకానందమంటూ..
చిరునవ్వుగా మారి నీకు చేరువవుతూ
240. చెదిరిపోని స్వప్నంలా నువ్వు..
పగటినిద్రనూ పాడు చేస్తూ..
మరచిన గాయాన్ని గుర్తుచేస్తూ..
No comments:
Post a Comment