101. అనుమానం తరలిపోయింది మబ్బులా..
నిన్ను నాకొదిలేసి ఆనందంగా...
వేచిచూడాలిక ఏ వానలు కురిపిస్తుందోనని..
102. మనసుతో మనసు కలిపేదెలా..
మౌనంలో నువ్వుంటే.,.
నా మాటలు నిన్ను చేరలేనంటుంటే..
103. రాగాలెన్నో తాకి చూసా..
ప్రతీరాగంలో నీ అనురాగమే..
నాపై అభిమానమెంతో కురిపిస్తూ..
104. సలహాలెందుకో..
సర్దిచెప్పేందుకు..
ఎదుటివారికో వ్యక్తిత్వం లేదని నిర్ణయించేందుకా..
105. జీర్ణం కాదుగా జీవితం..
బాగా అరాయించుకొనే వరకూ..
అర్థం చేసుకొని మసలిపోయేవరకూ..
106. నా ఊరెప్పుడూ నిజమే..
నా బాల్యాన్ని దాచుకున్నందుకు..
నన్నో సజీవంగా నిలబెట్టినందుకు..
107. అంతులేని కోరికలెందుకో నీకు
వేకువన వెన్నెల కావాలని కవ్విస్తూ...
సుప్రభాతానే అలుకలకు దారిస్తూ..
108. కోరికలు ఎగిసిపడుతున్నాయి..
నీ అడుగులో అడుగు కలపాలని..
నీ జతకు తాళం వేయాలని..
109. వేరే తీరాలెందుకులే..
నా మనసు గమ్యం తెలిసిపోయాక..
నాకై తలపుల గవ్వలేరుకుంటూ నువ్వు నిలబడ్డాక
110. అంతులేని ఆత్మీయపు గని..
కల్మషమెరుగని కమనీయపు తడి గుర్తించలేదా..
నీ మనసులోకోమారు తొంగిచూసుకోలేదా..
111. రేయి చిగురిస్తూనే ఉంది..
మల్లెల ఒయారాలతో తెల్లని కానుకలతో..
వసంతానికి అసూయ కలిగించే గ్రీష్మంలా..
112. అప్పుడప్పుడూ గుర్రాలు కూడా అవుతుంటాయ్ కోరికలు..
ఏ పచ్చికబయళ్ళలో విహరించాలనో..
ఏ గుర్రప్పందాల్లో పోటీ పడాలనో..
113. చూసే కన్నుల్లో ఉంది కదా శ్రామిక సౌందర్యం
కష్టించే జీవుల స్వేదంలో..
అలుపెరుగని కృషీవలుని కండల్లో..
114. కల్పవృక్షాలే కొన్ని వృక్షాలు..
తామెండి మనకి నీడనిస్తూ..
తాము ముక్కలైన మనకు గుమ్మాలవుతూ
115. ఒంటరివేదన మిగిల్చిన విషాదమేమో..
కంటికి కన్నీరు మాత్రమే తోడవుతూ..
జ్ఞాపకాలను కడిగేయాలని ప్రయత్నిస్తూ..
116. హృదయం ఉరకలేస్తోంది..
నా పిలుపుకి ప్రతిస్పందించినందుకేమో..
నీ చెంతకు పరుగు పెట్టమని తొందరచేస్తూ..
117. భరించలేని బాధవుతోంది..
నాలోంచీ నన్ను తీసేసినట్లు..
మనసంతా నువ్వే నిండినట్లు..
118. అడవికొమ్మల్లో చిక్కుకుందేమో కోయిలమ్మ..
జనారణ్యంలో జాడలేక..
దారితెన్నూ తెలియక కొట్టిమిట్టాడుతూ..
119. క్షణాలకెప్పుడూ పరుగులేగా..
నన్ను వీడి నిన్ను చేరాలనే తొందరలో..
ఒక్కటైన మనల్ని విడదీసే ప్రయత్నంలో..
120. అలుపెరుగని కాలమే..
కాలాతీతమై ఉరకలేస్తూ..
లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తూ..
నిన్ను నాకొదిలేసి ఆనందంగా...
వేచిచూడాలిక ఏ వానలు కురిపిస్తుందోనని..
102. మనసుతో మనసు కలిపేదెలా..
మౌనంలో నువ్వుంటే.,.
నా మాటలు నిన్ను చేరలేనంటుంటే..
103. రాగాలెన్నో తాకి చూసా..
ప్రతీరాగంలో నీ అనురాగమే..
నాపై అభిమానమెంతో కురిపిస్తూ..
104. సలహాలెందుకో..
సర్దిచెప్పేందుకు..
ఎదుటివారికో వ్యక్తిత్వం లేదని నిర్ణయించేందుకా..
105. జీర్ణం కాదుగా జీవితం..
బాగా అరాయించుకొనే వరకూ..
అర్థం చేసుకొని మసలిపోయేవరకూ..
106. నా ఊరెప్పుడూ నిజమే..
నా బాల్యాన్ని దాచుకున్నందుకు..
నన్నో సజీవంగా నిలబెట్టినందుకు..
107. అంతులేని కోరికలెందుకో నీకు
వేకువన వెన్నెల కావాలని కవ్విస్తూ...
సుప్రభాతానే అలుకలకు దారిస్తూ..
108. కోరికలు ఎగిసిపడుతున్నాయి..
నీ అడుగులో అడుగు కలపాలని..
నీ జతకు తాళం వేయాలని..
109. వేరే తీరాలెందుకులే..
నా మనసు గమ్యం తెలిసిపోయాక..
నాకై తలపుల గవ్వలేరుకుంటూ నువ్వు నిలబడ్డాక
110. అంతులేని ఆత్మీయపు గని..
కల్మషమెరుగని కమనీయపు తడి గుర్తించలేదా..
నీ మనసులోకోమారు తొంగిచూసుకోలేదా..
111. రేయి చిగురిస్తూనే ఉంది..
మల్లెల ఒయారాలతో తెల్లని కానుకలతో..
వసంతానికి అసూయ కలిగించే గ్రీష్మంలా..
112. అప్పుడప్పుడూ గుర్రాలు కూడా అవుతుంటాయ్ కోరికలు..
ఏ పచ్చికబయళ్ళలో విహరించాలనో..
ఏ గుర్రప్పందాల్లో పోటీ పడాలనో..
113. చూసే కన్నుల్లో ఉంది కదా శ్రామిక సౌందర్యం
కష్టించే జీవుల స్వేదంలో..
అలుపెరుగని కృషీవలుని కండల్లో..
114. కల్పవృక్షాలే కొన్ని వృక్షాలు..
తామెండి మనకి నీడనిస్తూ..
తాము ముక్కలైన మనకు గుమ్మాలవుతూ
115. ఒంటరివేదన మిగిల్చిన విషాదమేమో..
కంటికి కన్నీరు మాత్రమే తోడవుతూ..
జ్ఞాపకాలను కడిగేయాలని ప్రయత్నిస్తూ..
116. హృదయం ఉరకలేస్తోంది..
నా పిలుపుకి ప్రతిస్పందించినందుకేమో..
నీ చెంతకు పరుగు పెట్టమని తొందరచేస్తూ..
117. భరించలేని బాధవుతోంది..
నాలోంచీ నన్ను తీసేసినట్లు..
మనసంతా నువ్వే నిండినట్లు..
118. అడవికొమ్మల్లో చిక్కుకుందేమో కోయిలమ్మ..
జనారణ్యంలో జాడలేక..
దారితెన్నూ తెలియక కొట్టిమిట్టాడుతూ..
119. క్షణాలకెప్పుడూ పరుగులేగా..
నన్ను వీడి నిన్ను చేరాలనే తొందరలో..
ఒక్కటైన మనల్ని విడదీసే ప్రయత్నంలో..
120. అలుపెరుగని కాలమే..
కాలాతీతమై ఉరకలేస్తూ..
లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తూ..
No comments:
Post a Comment