............................... *****************.............................
421. మనసుకదో అభిమానం..
అభిరుచిని కలుపుకు మరీ ముడేసుకోవడం..
ఆనందాల్ని కలిసి పంచుకోవడం..
422. వలపు బంధమేసావనే..
విడిచిపోనంటూ మనసుబాసలు..
నిత్యనీరాజనాలే రేయింబవళ్ళు..
423. శివరంజనిరాగం వినిపిస్తున్నా...
నీ కర్ణాలకు ప్రేమను పరిచయిద్దామనే..
రసజగతిలో ఊయలూగిద్దామనే..
424. గాయాన్ని పరిచయించావెందుకో..
రేపటికి గేయంగా మారుతుందనే నమ్మకంలో..
అక్షరమై ఒదిగుంటుందనే ఆశతో..
425. కాటుకే హద్దులు గీసేస్తుంది..
నీ కన్నులతో ఊసులు చాలించమంటూ..
లిపి తెలిసిన నీ కన్నులకు బదులివ్వలేక..
426. జన్మజన్మలకీ అదేప్రేమ..
పునర్జన్మంటూ నిజమైతే..
మనసులోని కోరికకే బలముంటే..
427. తారలకెన్ని చమక్కులో..
నీటినే అద్దంగా మార్చేస్తూ..
తమ సోయగాల మెరుపులకి మురిసిపోతూ..
428. భావాల బెంగ తీరిపోయింది..
అనుభూతిగా మార్చుకున్నాక..
అక్షరమై నీ చేతిలో ఒదిగిపోయాక..
429. ఎన్ని వెదుర్లు గాయాలకోర్చాయో..
కన్నయ్య పెదవులను తాకాలనే తొందరలో..
ఉపశమనాన్ని సైతం ఆశించక..
430. అలరిస్తూనే ఉన్నాయి స్మృతులు..
నీరవంలో నీ రాగాన్ని వినిపిస్తూ..
నీరెండల్లో పిల్లగాలులై పలకరిస్తూ..
431. మౌనంగా దాచుకున్నా...
ఆశలై రాలిన పువ్వులన్నీ..
వాడిపోయినా పరిమళం వీడలేదనే..
432. నీలినయనాల్లో కన్నీటి సెలయేళ్ళు..
అనుభూతి లోపం తెలిసొచ్చిందో..
అనుభవలేమి వెక్కిరించిందో..
433. రంగులకల నిజమైంది..
నీ తోడు దొరికినందుకు..
మరిన్ని రంగులు చేర్చి మురిసినందుకు..
434. రెప్పలకి అలకయ్యిందట..
ఒళ్ళంతా కళ్ళుచేసుకొని నన్ను చూస్తున్నావని..
ఇంద్రుడ్ని మించి ప్రవర్తిస్తున్నావని..
435. మనసు కల్లోలమేగా..
కనపడని శూలాలై మాటలు గుచ్చుతుంటే..
అలసిన అంతరంగాన్ని మరింత బాధిస్తుంటే..
436. అంబరమంటిందిగా మనసు..
మేఘరాగంతో ఒక్కమారు హృది మీటినందుకే..
ఆనందం నన్ను దాటి ఎగిసినందుకే..
437. మక్కువెక్కువే నాపై చిన్నారికలలకి..
రేయంతా నన్ను సంతోషపెట్టాలని..
మనసిన నిన్ను కళ్ళముందే నిలబెట్టాలని..
438. అవనికి లేదెన్నడూ పక్షపాతం..
మనుషులవలే ముసుగేసుకోవడం..
సజీవమైన మనసులనీ చంపేయడం.
439. గడచిపోయిన నిన్నటి దిగులెందుకు..
ఆశావాహమైన భవిష్యత్తు ముందుండగా..
వర్తమానాన్ని మనసారా వరించక...
440. నక్షత్రమాలని కట్టానందుకే..
ఆకాశానికి తోరణంగా..
చీకటిని దరిచేర్చరాదనే..
............................... *****************.............................
421. మనసుకదో అభిమానం..
అభిరుచిని కలుపుకు మరీ ముడేసుకోవడం..
ఆనందాల్ని కలిసి పంచుకోవడం..
422. వలపు బంధమేసావనే..
విడిచిపోనంటూ మనసుబాసలు..
నిత్యనీరాజనాలే రేయింబవళ్ళు..
423. శివరంజనిరాగం వినిపిస్తున్నా...
నీ కర్ణాలకు ప్రేమను పరిచయిద్దామనే..
రసజగతిలో ఊయలూగిద్దామనే..
424. గాయాన్ని పరిచయించావెందుకో..
రేపటికి గేయంగా మారుతుందనే నమ్మకంలో..
అక్షరమై ఒదిగుంటుందనే ఆశతో..
425. కాటుకే హద్దులు గీసేస్తుంది..
నీ కన్నులతో ఊసులు చాలించమంటూ..
లిపి తెలిసిన నీ కన్నులకు బదులివ్వలేక..
426. జన్మజన్మలకీ అదేప్రేమ..
పునర్జన్మంటూ నిజమైతే..
మనసులోని కోరికకే బలముంటే..
427. తారలకెన్ని చమక్కులో..
నీటినే అద్దంగా మార్చేస్తూ..
తమ సోయగాల మెరుపులకి మురిసిపోతూ..
428. భావాల బెంగ తీరిపోయింది..
అనుభూతిగా మార్చుకున్నాక..
అక్షరమై నీ చేతిలో ఒదిగిపోయాక..
429. ఎన్ని వెదుర్లు గాయాలకోర్చాయో..
కన్నయ్య పెదవులను తాకాలనే తొందరలో..
ఉపశమనాన్ని సైతం ఆశించక..
430. అలరిస్తూనే ఉన్నాయి స్మృతులు..
నీరవంలో నీ రాగాన్ని వినిపిస్తూ..
నీరెండల్లో పిల్లగాలులై పలకరిస్తూ..
431. మౌనంగా దాచుకున్నా...
ఆశలై రాలిన పువ్వులన్నీ..
వాడిపోయినా పరిమళం వీడలేదనే..
432. నీలినయనాల్లో కన్నీటి సెలయేళ్ళు..
అనుభూతి లోపం తెలిసొచ్చిందో..
అనుభవలేమి వెక్కిరించిందో..
433. రంగులకల నిజమైంది..
నీ తోడు దొరికినందుకు..
మరిన్ని రంగులు చేర్చి మురిసినందుకు..
434. రెప్పలకి అలకయ్యిందట..
ఒళ్ళంతా కళ్ళుచేసుకొని నన్ను చూస్తున్నావని..
ఇంద్రుడ్ని మించి ప్రవర్తిస్తున్నావని..
435. మనసు కల్లోలమేగా..
కనపడని శూలాలై మాటలు గుచ్చుతుంటే..
అలసిన అంతరంగాన్ని మరింత బాధిస్తుంటే..
436. అంబరమంటిందిగా మనసు..
మేఘరాగంతో ఒక్కమారు హృది మీటినందుకే..
ఆనందం నన్ను దాటి ఎగిసినందుకే..
437. మక్కువెక్కువే నాపై చిన్నారికలలకి..
రేయంతా నన్ను సంతోషపెట్టాలని..
మనసిన నిన్ను కళ్ళముందే నిలబెట్టాలని..
438. అవనికి లేదెన్నడూ పక్షపాతం..
మనుషులవలే ముసుగేసుకోవడం..
సజీవమైన మనసులనీ చంపేయడం.
439. గడచిపోయిన నిన్నటి దిగులెందుకు..
ఆశావాహమైన భవిష్యత్తు ముందుండగా..
వర్తమానాన్ని మనసారా వరించక...
440. నక్షత్రమాలని కట్టానందుకే..
ఆకాశానికి తోరణంగా..
చీకటిని దరిచేర్చరాదనే..
............................... *****************.............................
No comments:
Post a Comment